మజ్లిస్ (ఏఐఎంఐఎం) పార్టీ 64వ ఆవిర్భావ సమావేశ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తనకు నచ్చిన దుస్తులు ధరించినప్పుడు.. మేము ఎందుకు మాకు నచ్చినవి ధరించకూడదని ప్రశ్నించారు. భారత్ లో అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు.. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఫుడ్ తినవచ్చు.. నచ్చిన దేవుణ్ణి పూజించే అవకాశం ఉందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
యోగి తనకు నచ్చిన దుస్తులు ధరించి సీఎం హోదా లో ఉన్నప్పుడు.. ఈ దేశంలో మా మహిళలు ఎందుకు భుర్ఖా ధరించకూడదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశ సరిహద్దు ప్రాంతాలు సురక్షితంగా లేవని ఆయన అన్నారు. విదేశీ పాలసీ నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ అల్లాడిపోతున్నారని.. పిల్లల్ని సురక్షితంగా ఇండియా కి చేర్చే బాధ్యత కేంద్రానిదే అని అక్బరుద్దీన్ అన్నారు. ఇదిలావుంటే 1958లో ఏఐఎంఐఎం పార్టీ స్థాపించబడింది.