పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి.. సాధించడానికి కష్టపడండి..

Aim big and work hard to achieve goals of your life. Youth need to make their parents proud. ఘట్‌కేసర్‌లోని మోడల్‌ మార్కెట్‌, చంపాపేట్‌, అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం జరిగిన

By Medi Samrat  Published on  4 May 2022 10:03 AM GMT
పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి.. సాధించడానికి కష్టపడండి..

ఘట్‌కేసర్‌లోని మోడల్‌ మార్కెట్‌, చంపాపేట్‌, అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం జరిగిన పోలీస్‌ ప్రీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీపీ మహేశ్‌ భగవత్‌ ఐపీఎస్‌ మాట్లాడుతూ.. జీవితంలో లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాల‌న్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సీపీ సూచించారు. పోలీసు ఉద్యోగాన్ని ఆశించే వ్య‌క్తుల‌కు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు.

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ నేప‌థ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఫ‌రిధిలో పోలీస్ శాఖలో చేరేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు ముందస్తు శిక్షణను అందిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఎల్‌బీ నగర్ మోడల్ మార్కెట్ చంపాపేట్, భారతి ఇంజినీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం, అరోరా ఇంజినీరింగ్ కాలేజ్ ఘట్‌కేసర్‌లో క‌లిపి మొత్తం 2000 మంది ఔత్సాహికులు ఈ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారని సీపీ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఔత్సాహికులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది" అని సీపీ తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్.. గతంలో నోటిఫికేషన్‌ల సమయంలో పలు చోట్ల ఉచిత కోచింగ్‌ను అందించిందని, దీంతో చాలా మంది యువత పోలీసు శాఖలో చేరేందుకు దోహదపడింద‌ని సీపీ గుర్తు చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో ప్రీ రిక్రూట్‌మెంట్ శిక్షణతో 600 మంది యువత పీసీకి ఎంపికయ్యారని, 50 మందికి పైగా సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు పొందారని సీపీ గుర్తు చేశారు.

ప్రీ రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమం ఒక గొప్ప చొరవ అని సీపీ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో డబ్బు చెల్లించి కోచింగ్ పొందలేని చాలా మంది పేద ఔత్సాహికులకు ఉచిత శిక్షణ ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని.. మంచి అర్హత కలిగిన అధ్యాపకులు ఔత్సాహికులకు బోధిస్తారని పేర్కొన్నారు.కోచింగ్ ప్రధాన పరీక్షల వరకు కొనసాగుతుందని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్యాపకులకు, ఏర్పాట్లకు ఔత్సాహికుల తరపున డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీ నగర్‌, ఘట్‌కేసర్‌, ఇబ్రహీంపట్నం మూడు శిక్షణా కేంద్రాల్లో మొత్తం 2000 మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన దాతలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.Next Story
Share it