పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణు ప్రియ ఏమి చెప్పింది.?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు.
By Medi Samrat
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 11 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో సినీ నటి, యాంకర్ విష్ణుప్రియు పేరు కూడా ఉంది. పంజాగుట్ట పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా నోటీసులు అందుకున్న విష్ణుప్రియ తాజాగా పోలీస్టేషన్‌కు వెళ్లారు. తన అడ్వకేట్‌తో కలిసి విష్ణుప్రియ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది. తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు తెలిపింది. అలా ఒక్కో యాప్‌కు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు కూడా తెలిపింది. విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించారు.
మియాపూర్ ప్రగతి ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ పిర్యాదు మేరకు.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నటులు హీరో రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సినీ హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అనన్య నాగళ్ల, సిరి హనుమంతు , శ్రీముఖి, విష్ణు ప్రియ, భయ్యా సన్నీ యాదవ్, నటి శ్యామల, టేస్టీ తేజ , బండారు శేష సుకృతి , రీతు చౌదరి మొత్తం ఇలా 25మందిపై పలు సెక్షల కింద కేసులు నమోదు చేశారు.