వారిపై చర్యలు తీసుకోండి: రాజా సింగ్

గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా గణేష్ విగ్రహాల ముందు మద్యం సేవించి మహిళలను ఈవ్ టీజ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్‌ను కోరారు

By Medi Samrat  Published on  11 Sept 2024 6:30 PM IST
వారిపై చర్యలు తీసుకోండి: రాజా సింగ్

గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా గణేష్ విగ్రహాల ముందు మద్యం సేవించి మహిళలను ఈవ్ టీజ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్‌ను కోరారు. హైదరాబాద్ కమిషనర్‌కు రాసిన లేఖలో ఇటీవలి సంవత్సరాలలో కొంతమంది వ్యక్తులు ఊరేగింపులలో చేరి అసంబద్ధ కార్యకలాపాలకు పాల్పడి ఇబ్బందులు కలిగిస్తూ ఉండడం తాను చూశానని అన్నారు.

కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగడం, ప్రజలపై వాటర్ ప్యాకెట్లను విసిరే సంఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి ఆకతాయిలు ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. మహిళలు, బాలికలపై వేధింపులు వేడుకల పవిత్రతను దెబ్బతీసే సమస్యగా మారాయన్నారు. ఇలాంటి ప్రవర్తనలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా పెంచాలని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు.

Next Story