Hyderabad : సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 5:29 PM IST

Hyderabad : సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ బిల్డింగ్ లో కార్మికులు పని చేస్తుండగా సెంట్రింగ్ కూలటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. హాస్పిటల్ లో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడటంతో ప్రమాదం జరిగింది. సెంట్రింగ్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story