చీమలంటే ఆ మహిళకు భయం, కౌన్సెలింగ్ ఇప్పించినా మార్పు లేకపోవడంతో సూసైడ్

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 6 Nov 2025 4:44 PM IST

Hyderabad News, Sangareddy District, Ameenpur, Myrmecophobia, Manisha, Ant Phobia, Suicide

చీమలంటే ఆ మహిళకు భయం, కౌన్సెలింగ్ ఇప్పించినా మార్పు లేకపోవడంతో సూసైడ్

సంగారెడ్డి : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో శ్రీకాంత్, మనీషా (25) దంపతులు నివసిస్తున్నారు. కొంతకాలంగా మనీషా చీమలంటే తీవ్ర భయంతో (మైర్మెకోఫోబియా) బాధపడుతోంది. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెకు ఆసుపత్రిలో చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయితే, ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు.

మంగళవారం సాయంత్రం భర్త శ్రీకాంత్ విధులకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్‌రూమ్ తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో ఆందోళన చెంది, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మనీషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మనీషా రాసిన ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. "శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు. కూతురు అన్వి జాగ్రత్త. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి" అని లేఖలో రాసి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story