ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం
A flurry of fake certificates in OU. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్స్ బాగోతం కలకలం రేపుతుంది.
By Medi Samrat Published on 18 Feb 2022 7:57 PM ISTఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్స్ బాగోతం కలకలం రేపుతుంది. ఈ విషయమై శుక్రవారం ఓయూ విద్యార్థి నాయకులు హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదుచేశారు. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి విద్యార్థి నేతలు వివరించారు. నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు ధ్రువీకరించారు. కన్సల్టేషన్, ఎడ్యుకేషన్ ఇన్ట్సిట్యూట్స్ అడ్డాగా ఈ దందా సాగుతుందని విద్యార్థి నాయకులు నగర సీపీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతో సహా తగిన ఆధారాలను విద్యార్థి నేతలు సీపీకి అందజేశారు. ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని.. ముద్దం స్వామిని పది రోజులలో అదుపులోకి తీసుకుంటామని హైదరాబాద్ సీపీ హామీ ఇచ్చారని ఉస్మానియా విద్యార్థి నాయకుడు శరత్ నాయక్ తెలిపారు.