Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం

హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది.

By అంజి  Published on  10 July 2023 8:05 AM IST
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం

హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. బాలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్‌ చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్‌ స్పేస్‌ అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలతో అలుముకుంది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నగరంలోని ఫిలింనగర్‌లో ప్రయాణిస్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో కారు పూర్తిగా తగలబడిపోయింది. కారులోంచి బయటకు దూకి ఇద్దరు యువకులు ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో డ్రైవర్ ఇబ్రహీంతో పాటు మరో ప్రయాణీకుడు ఉన్నారు. ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Next Story