Hyderabad: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. వీడియో
ఎస్‌ఆర్ నగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By - అంజి |
Hyderabad: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. వీడియో
హైదరాబాద్: ఎస్‌ఆర్ నగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపాడు. మియాపూర్ నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. రోడ్డుపైనే బస్సును ఆపేసిన డ్రైవర్.. ప్రయాణికుల్ని దించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. అప్పటికే ట్రావెల్ బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది.
బస్సులో ఉన్న వారందరినీ డ్రైవర్ క్షేమంగా కిందికి తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలోనే కూకట్పల్లి నుంచి పంజాగుట్ట రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ కిందనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు వచ్చే సమయానికి మెట్రో సర్వీసులు ముగియడంతో ప్రమాదం తప్పింది. మంటల ధాటికి మెట్రో స్టేషన్ మొత్తానికి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
#Hyderabad---- ఎస్‌ఆర్ నగర్‌లో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సును ఆపేసిన డ్రైవర్ రోడ్డుపైనే ఆపేశాడు. ప్రయాణికుల్ని కిందకు దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొంది. pic.twitter.com/5jT8cMjemc
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 26, 2025