హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..కారు షోరూమ్‌లో మంటలు

హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది

By -  Knakam Karthik
Published on : 14 Jan 2026 2:56 PM IST

Hyderabad News, Secunderabad, Alwal, Fire Accident, TrueValue car showroom

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..కారు షోరూమ్‌లో మంటలు

హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ అల్వాల్‌లోని ట్రూ వ్యాల్యూ కార్ షోరూమ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్పందించిన కార్ల షోరూం సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

రెండు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకుపోయింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story