Hyderabad: పోలీసునే ఢీ కొట్టి పారిపోయిన కారు డ్రైవర్.. వీడియో

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను కారుతో ఢీ కొట్టి వెళ్ళిపోయాడో కారుడ్రైవర్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

By అంజి  Published on  20 Oct 2023 2:00 AM GMT
Hyderabad, Gopalapuram, constable injured, accident

Hyderabad: పోలీసునే ఢీ కొట్టి పారిపోయిన కారు డ్రైవర్.. వీడియో

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను కారుతో ఢీ కొట్టి వెళ్ళిపోయాడో కారుడ్రైవర్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలగూడ అలుగడ్డ బావి దగ్గర ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అక్కడ భారీ కేడ్లు వేసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. మితిమీరిన వేగంగా వచ్చిన ఒక కారు భారీ కేడ్లను సైతం తప్పించుకోని నేరుగా వెళ్ళి కారు ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ మహేశ్‌ను ఢీ కోట్టింది. దీంతో మహేశ్ ఎగిరికింద పడిపోయాడు.

అయినా కూడా ఆ కారు డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా కారుతో సహ అక్కడి నుంచి పరారయ్యాడు. మహేశ్ కింద పడిపోయి ఉండడం గమనించిన మిగతా పోలీసులు వెంటనే అతని దగ్గరలో ఉన్న ఒక ప్రైవెట్ ఆసుపత్రికి తరలించగా.. ప్రాణపాయం లేదని చేయి మాత్రం విరిగినట్లు వైద్యులు తెలిపారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని అసలు కారులో ఏముంది? మితిమీరిన వేగంతో కారు ఎందుకు దూసుకు వెళ్ళింది? కారు ఎక్కడి నుండి వస్తుంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.

Next Story