బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్‌లో కేసు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.

By -  Knakam Karthik
Published on : 31 Oct 2025 11:14 AM IST

Hyderabad News, JubileeHills, Maganti Sunitha, BRS, JubileeHills bypoll, Borabanda Police Station.

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్‌లో కేసు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్‌ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌ (Ro)కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లు ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story