హైద‌రాబాద్ లోక్‌స‌భ‌ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయ్యింది

By Medi Samrat  Published on  22 April 2024 8:03 AM IST
హైద‌రాబాద్ లోక్‌స‌భ‌ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయ్యింది. ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్న ఆమె బేగంబజార్ వద్ద ఉన్న మక్కా వైపు గురిపెడుతూ ఉహాజ‌నిత బాణం విడిచిన వ్యవహారంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జ‌రిగిన ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగుతుంది. మాధవి లత తీరుపై ఎంఐఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వైర‌లైన ఈ వీడియోపై మాధవి లత వివరణ కూడా ఇచ్చారు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర రోజు గాలిలో బాణం విసిరిన తనను మాస్క్ పై విసిరినట్లుగా క్రియేట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో కావాలనే పోస్ట్ చేశారని అన్నారు.అయితే ఈ వీడియో ముస్లీంల‌ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి మాధవి లత పై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మాధవి లతపై కేసు నమోదు చేశారు.

Next Story