హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులోని ప్రయాణికులను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే.. మొన్న కృష్ణానగర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపునకు వెళ్తూ రోడ్డు మధ్యలోని మెట్రో పిల్లర్ డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు వెనుక చక్రం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని స్థానికులు తెలిపారు.