ఇనార్బిట్ మాల్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
75th Independence Day Celebrations at Inorbit Mall. ఈ సంవత్సరం భారతీయులందరికీ అత్యంత ప్రత్యేకమైనది.
By Medi Samrat Published on 7 Aug 2022 4:00 PM IST
ఈ సంవత్సరం భారతీయులందరికీ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే.. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. సైబరాబాద్ ఇనార్బిట్ మాల్ లో కూడా ఈ వేడుకలు 6వ తేదీన ప్రారంభమయ్యాయి. మాల్ ముందు భాగంలో త్రివర్ణ పతాక రంగులలో అలంకరణ లైట్లు వెలిగించి ఈ వేడుకలు ప్రారంభించారు.
హైదరాబాద్ వాసులు ఈ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలో భాగంగా మాల్ నుంచి ఎంతో ఆశించవచ్చు. అత్యంత అందమైన, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఫ్రీడమ్ ట్రీ ఇన్‌స్టాలేషన్ సందర్శకులను మాల్ లోపలకు ఆహ్వానించడమే కాదు, స్వేచ్ఛా స్ఫూర్తిని సైతం రగిలిస్తోంది. మాల్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరూ భారతదేశం కోసం తమ ఆకాంక్షలను ఆ చెట్టు వద్ద రాయడం లేదా మన దేశం గురించిన భావాలను రాసి చెట్టుకు అంటించవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా వీరికి ఓ జాతీయజెండానూ పొందవచ్చు. తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై ఈ ఫ్రీడమ్ ట్రీ వద్ద దిగిన చిత్రాన్ని అప్‌లోడ్ చేసి ట్యాగ్ చేయడం ద్వారా మాల్ ఓచర్లను సైతం పొందే అవకాశం ఉంది. ఈ యాక్టివిటీ ఆగస్టు 15వ తేదీ వరకూ జరుగుతుంది.
మాల్‌లో తాము గడిపిన ప్రతి క్షణాన్నీ బంధించాలనుకునే సందర్శకులకు మాల్‌లో విస్తృత శ్రేణి అవకాశాలు కూడా ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మువ్వన్నెల బ్యాక్‌డ్రాప్స్‌లో ఎల్‌జీ పిల్లర్, అట్రియం హ్యాంగింగ్స్ మాల్‌లో ఉన్నాయి. ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌ను ఆగస్టు 15వ తేదీ లోపుగా సందర్శించడానికి మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి ప్రణాళిక చేసుకోండి. ఆనందానుభూతులనూ సొంతం చేసుకోండి.