హైదరాబాద్ రోడ్లపైకి బుధవారం 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి. ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపో లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్ టి సి ఎం డీ వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ వివిధ రూట్లలో నడుపుతోంది.