విమానాశ్రయాలు బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు చేసుకున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అధికారులు 823 గ్రామలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో బంగారాన్ని లో దుస్తుల్లో దాచినట్లు గుర్తించారు. వెంటనే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.47లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఇతడిని హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.