174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత

హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఓల్డ్ సిటీలో చారిత్రాత్మక 'మున్షి నాన్' అవుట్ లెట్ ను నేలమట్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 3:28 PM IST

174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత

హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఓల్డ్ సిటీలో చారిత్రాత్మక 'మున్షి నాన్' అవుట్ లెట్ ను నేలమట్టం చేశారు. 174 ఏళ్ల నాటి మున్షి నాన్ దుకాణం కూల్చివేత అక్టోబర్ 14న జరిగిందని దాని యజమాని అబ్దుల్ హమీద్ తెలిపారు. మున్షి నాన్ అదే ప్రాంతంలో తిరిగి తెరవబడుతుందని హమీద్ తెలిపారు. కూల్చివేసిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న సందులో వచ్చే రెండు వారాల్లో తిరిగి తెరవబోతున్నట్లు హమీద్ చెప్పారు.

మున్షి నాన్ ఒక ఐకానిక్ చారిత్రక సంస్థ. హైదరాబాద్‌లో ఎంతో మందికి చాలా ఇష్టమైన అవుట్ లెట్. దాని అసలు రుచి ఎప్పుడూ మారకుండా చూసుకోవడానికి, దాని ప్రామాణికతను కాపాడుకోవడానికి యజమానులు సాంప్రదాయ భట్టిలో నాన్‌ను తయారు చేశారు, ఇది ప్రతిరోజూ వందలాది మంది కస్టమర్లు ఇక్కడకు తినడానికి క్యూ కడతారు.

Next Story