14 మంది యువతులు కస్తూర్భా ట్రస్టు నుంచి పరారీ
14 Women escaping from Kasturba trust in Hyderabad.శుక్రవారం తెల్లవారుజామున గండిపేట మండలం హైదర్షాకోట్‌లోని
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2022 3:38 AM GMTశుక్రవారం తెల్లవారుజామున గండిపేట మండలం హైదర్షాకోట్‌లోని కస్తూర్భా గాంధీ ఆశ్రమం నుంచి కొంత మంది యువతులు పరారు అయ్యారు. బాత్రూమ్‌లోని కిటికీ ఊచలు కట్‌చేసి 14 మంది యువతులు పరారు కావడం సంచలనంగా మారింది. ట్రస్ట్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పరారీ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాలతో పోలీసులు కస్తూర్భాగాంధీ స్మారక ట్రస్టులో ఉంచుతారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తుంటారు. ఇలా 18 మందిని ఓ హాల్‌లో పూర్తి భద్రత మధ్య ఉంచారు. వీరిలో 15 మంది పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారు.
అందుబాగంగా శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాత్రూమ్‌లోని కిటికీ ఊచలు విరగగొట్టి పారిపోయేందుకు యత్నించారు. అయితే.. ఆ సమయంలో ఓ యువతికి స్వల్ప గాయం కావడంతో అక్కడే ఉండిపోగా.. మిగిలిన వారు పరారు అయ్యారు. ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోయిన వారిలో బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.