హైదరాబాద్‌లో బాలుడు అదృశ్యం.. తిరుపతిలో ప్రత్యక్షం

మీర్పేట్‌లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. మీర్పేట్‌కి చెందిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు.

By అంజి  Published on  6 Aug 2024 12:12 PM IST
missing , Hyderabad,  Tirupati, Meerpet

హైదరాబాద్‌లో బాలుడు అదృశ్యం.. తిరుపతిలో ప్రత్యక్షం

హైదరాబాద్‌: మీర్పేట్‌లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. మీర్పేట్‌కి చెందిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు అతని పట్టుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మహేందర్ అనే బాలుడు ట్యూషన్ అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లాడు. అయితే ట్యూషన్‌కు వెళ్లిన ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. బాలుడు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే మీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఓ వ్యక్తి బైక్ పై బాలుడు వెళ్ళినట్టుగా కనిపించింది.

సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. బాలుడు మీర్పేట్ వద్ద ఉన్న బస్ స్టాప్ లో కౌంటర్ దగ్గర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు బస్ స్టాప్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించగా.. చివరగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో బాలుడు టికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు. ఇదంతా కెమెరాలో చిక్కింది. వెంటనే అప్రమత్త మైన పోలీసులు తిరుపతికి వెళ్లి బాలుని పట్టుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Next Story