అసదుద్దీన్ ఒవైసీ ఆరోగ్యంగా ఉండాలని.. 101 మేకలు బలి
101 goats sacrificed by Hyd bizman to pray for Owaisi after attack. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఓ అభిమాని
By అంజి Published on 7 Feb 2022 4:10 AM GMTఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఓ అభిమాని 101 మేకలను బలి ఇచ్చాడు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్-ఎ-జహనారా వద్ద అభిమాని 101 మేకలను బలి ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే, ఏఐఎంఐఎం నాయకుడు అహ్మద్ బలాల పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. అసదుద్దీన్ గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఫిబ్రవరి 3 న దాడి జరిగినప్పటి నుండి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ మద్దతుదారులు అసదుద్దీన్ భద్రత, దీర్ఘాయువు కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
దాడి తర్వాత, అసదుద్దీన్ ఒవైసీకి జెడ్- కేటగిరీ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే, అతను భద్రతను తిరస్కరించాడు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై కాల్పులు జరిగాయి. గాయాలు లేకుండా బయటపడ్డాడు. హాపూర్‌లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు సచిన్ పండిట్ బుల్లెట్లు కాల్చాడు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సచిన్, శుభమ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో, 'చంపాలనే ఉద్దేశ్యంతో' కాల్చినట్లు నిందితుడు సచిన్ చెప్పాడు. తాను బీజేపీ సభ్యుడినని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా ఛప్రౌలీ పట్టణంలో శనివారం జరిగిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. 'నాపై దాడి చేసిన వారే గాంధీని చంపిన వారే' అని అన్నారు.