100 ఏళ్ల నాటి 'స్టోన్ బిల్డింగ్'ను కూల్చేస్తారా.!
By అంజి Published on 8 Feb 2020 5:32 AM GMTముఖ్యాంశాలు
- నేలమట్టంకానున్న వందేళ్ల నాటి స్టోన్ బిల్డింగ్
- నిజాం పాలనలో 1910లో నిర్మించిన స్టోన్ బిల్డింగ్
- వాస్తు దోషం కారణంగా.. కూల్చివేతకు నిర్ణయం
హైదరాబాద్: అది వందేళ్లనాటి చారిత్రక కట్టడం.. ఆ భవనాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ భవనాన్ని నెలమట్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కారణం.. ఈ రాతి భవనం వల్ల సెక్రటేరియట్‌కు వాస్తు దోషం ఉందట. సెక్రటేరియట్ అవుట్ గేట్ పక్కనే మింట్ కాంపౌండ్‌లో ఉన్న ఈ భవనం వల్ల సెక్రటేరియట్ వాస్తు దోషం ఉందని వాస్తు నిపుణులు చెప్పారట. దీంతో ఈ స్టోన్ బిల్డింగ్‌ను కూల్చివేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.
నిజాం పరిపాలనలో 1910 సంవత్సరంలో ఈ భవనాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించిన కార్యాకలాపాలు జరుగుతున్నాయి. నగరంలో ఉన్న ఈ రాతి భవనానికి పెద్ద చరిత్రే ఉంది. దక్షిణాసియాలోనే తొలిసారిగా ఈ భవనంలోనే తొలి థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాతి భవనంలోనే కొన్నాళ్ల పాటు ఉస్మానియా టెక్నికల్ కళాశాల కొనసాగింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సంబంధిత కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ రాతి భవనం ఇప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉంది. వాస్తు దోషంమంటు ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చడం సరికాదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.