Fact Check : హైదరాబాద్ అపార్ట్మెంట్ వాసులు గాంధీ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి ఘన స్వాగతం పలికారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 May 2020 5:34 AM GMT
Fact Check : హైదరాబాద్ అపార్ట్మెంట్ వాసులు గాంధీ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి ఘన స్వాగతం పలికారా..?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని ముచ్చెమటలు పట్టిస్తోంది. వైద్యులు ముందు వరుసలో ఉండి మహమ్మారితో పోరాడుతూ ఉన్నారు. దేశం లోని చాలా చోట్ల వైద్యులకు ఘన సత్కారం లభిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ లేడీ డాక్టర్ ను చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు అభినందించిన వీడియోను షేర్ చేశారు. 20 రోజుల పాటూ ఏకధాటిగా ఆసుపత్రిలో బాధ్యతలు నిర్వర్తించింది. ఎంతో మంది కోవిద్-19 రోగుల బాగోగులను చూసుకుంది ఆమె.

ఈ వీడియో వైరల్ అవ్వగానే.. పలు ప్రాంతాల్లో డాక్టర్లను అభినందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది వాటిని షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో వీడియో హైదరాబాద్ కు చెందినదంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చేరి ఓ మహిళను అభినందిస్తున్న వీడియో హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లో చోటు చేసుకుందని షేర్ చేయడం మొదలుపెట్టారు.

“A doctor returns home to a deserved welcome and applause after 2 weeks duty at Gandhi Hospital – Hyderabad, India.” అంటూ వైరల్ అవ్వడం మొదలైంది.



హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో రెండు వారాల పాటూ విధులు నిర్వర్తించి ఇంటికి చేరుకున్న మహిళకు అరుదైన గౌరవం దక్కింది అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి వైరల్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న ఆ మహిళను బాల్కనీలో నిలబడిన అపార్ట్మెంట్ వాసులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు.

లోకల్ యూట్యూబ్ ఛానల్ 'లైఫ్ ఆంధ్ర టీవీ' ఈ వీడియోను తమ యూట్యూబ్ పేజీలో అప్లోడ్ చేసింది. “Grand welcome to Gandhi Hospital Dr Vijaya Sree from her neighbours.” అని పేరు పెట్టి వీడియోను అప్లోడ్ చేశారు.

ఈ వీడియోకు 50,000కు పైగా వ్యూస్ దక్కాయి. ఇది నిజంగా హైదరాబాద్ లో చోటుచేసుకుందా..?

నిజమెంత:

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించగా.. ఈ వీడియోను 'Ranka Heights' అనే ఫేస్ బుక్ పేజ్ లో ఏప్రిల్ 30న పోస్ట్ చేశారు.

ఆ ఫేస్ బుక్ పేజ్ సమాచారం ప్రకారం.. ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లోని దోంలూర్ లే అవుట్ లో ఉంది. తమ అపార్ట్మెంట్ సొసైటీలో చోటుచేసుకునే ఈవెంట్స్ ను, ఘటనలను ఈ ఫేస్ బుక్ పేజ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ సొసైటీకి వెబ్ పోర్టల్ కూడా ఉంది.

“Dr. Vijayshree (our little Viji) was given a standing ovation for her role in the pandemic….she was a junior doctor who worked with the Covid patients and post her quarantine, just has come back home. A small gesture from her fellow residents.Well done Viji. Ranka Heights is proud of you. (sic).” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

D0

డాక్టర్ విజయ శ్రీ(మా చిట్టి విజి) ని మేమంతా ఎంతగానో గౌరవిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఆమె చూపిన తెగువ.. చేస్తున్న సేవను మేమంతా అభినందిస్తున్నాము. ఆమె ఓ జూనియర్ డాక్టర్, కోవిద్ రోగులకు ఆమె చికిత్స అందిస్తోంది. ఆమె విధులు నిర్వర్తించి ఇంటికి చేరుకుంది. ఆమెను అభినందిస్తూ మేము ఇలా చేసాం. చాలా మంచి పని చేసావు విజి. రాంకా హైట్స్ నువ్వు చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతోంది అని రాసుకుని వచ్చారు.

అదే ఫేస్ బుక్ పేజ్ లో డాక్టర్ విజయ శ్రీ స్పందనకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ 'ఇది కేవలం నా ఒక్కదానికి దక్కిన గౌరవం మాత్రమే కాదని. చాలా మంది జూనియర్ డాక్టర్లు ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ లో 8 నుండి 12 గంటల పాటూ ప్రతిరోజూ పని చేస్తూ ఉన్నారు. డాక్టర్ వృత్తిని చేపట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నా కుటుంబం కూడా ఆనందంగా ఉంది. తనకు దక్కిన ఈ గౌరవానికి ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.

D1

ఈ వీడియో NTV తెలుగు యుట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 30న పోస్టు చేసింది. బెంగళూరులో డాక్టర్ కు దక్కిన అరుదైన గౌరవం.. ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

కాబట్టి ఇది హైదరాబాద్ లో జరిగింది అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు.. ఇది హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఘటన కానే కాదు. ఈ ఘటన చోటు చేసుకుంది బెంగళూరులో..!

Claim Review:Fact Check : హైదరాబాద్ అపార్ట్మెంట్ వాసులు గాంధీ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి ఘన స్వాగతం పలికారా..?
Claim Fact Check:false
Next Story