‘దిశ’ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడు  అరెస్టు

 Published on  4 Dec 2019 4:33 PM GMT
‘దిశ’ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడు  అరెస్టు

హైదరాబాద్ దిశ ఘటన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడు అరెస్టు అయ్యాడు. గుంటూరు జిల్లా అమరావతికిలోని కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ ఎలియాస్ నాని అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేశాడని, ఫేస్ బుక్ లో గ్రూప్ గా ఏర్పడి దిశ పై అసభ్య కామెంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇప్పటికి ఇద్దరు అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరికొంతమంది కూడా త్వరలో లో అరెస్టు చేస్తామని పోలీసులు వివరించారు. అరెస్టు చేసిన నానిని ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పర్చినట్లు చెప్పారు. కాగా, ‘దిశ’ ఘటనపై నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో, అందుకు షాద్ నగర్ కోర్టు అంగీకరించింది. దీంతో రేపు జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు.

Next Story
Share it