ఓ పక్క జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ ఉద్యమం.. మరో పక్క మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరాచకం
By అంజి Published on 1 Dec 2019 10:27 AM ISTహైదరాబాద్: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు అశీష్ గౌడ్‌పై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అశీష్ గౌడ్ తనపై దురుసుగా ప్రవర్తించాడని బిగ్‌బాస్ రియాల్టీ షోలోకంటెస్ట్ చేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చేయి పట్టి లాగాడని.. అందుకు ప్రతిఘటిస్తే మద్యం బాటిళ్లతో తనపై దాడికి దిగాడని, బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని అశీష్ గౌడ్‌పై యువతి ఆరోపణలు చేసింది. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పబ్‌లో స్నేహితురాలితో ఉన్న సమయంలో ఆశీష్ గౌడ్ వేధింపులకు గురి చేశాడని వెంటనే మేము అక్కడి నుంచి తప్పించుకున్నామని తెలిపింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అన్ని నిజాలు బయట పడతాయని బిగ్‌బాస్‌లో కంటెస్ట్ చేసిన యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అశీశ్ తమపై దురుసుగా ప్రవర్తిస్తున్న అక్కడి ఉన్నవారూ ఎవరు స్పందించలేదని తెలిపింది. పబ్ నిర్వహకులు కూడా స్పందించలేదని పోలీసులకు తెలిపింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు.