కే.ఏ పాల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

By అంజి  Published on  27 Nov 2019 7:53 AM GMT
కే.ఏ పాల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూను రేపు కోర్టుకు ఇవ్వాలని నిర్మాతను హైకోర్టు ఆదేశించింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్‌ పిటిషన్‌ వేశారు. సినిమా ట్రైలర్‌లో తనను కించపరిచేలా చూపించారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి కించపరిచేలా ఈ చిత్రాన్ని నిర్మించారని ఆధారాలను పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. కాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాలేదని.. ఈ చిత్రంపై రివ్యూ నడుస్తోందని చిత్రయూనిట్‌ కోర్టుకు తెలిపింది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Next Story