మెట్రోలో కొత్త సదుపాయం.. 3 నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్‌.!

By అంజి  Published on  10 Dec 2019 2:25 PM IST
మెట్రోలో కొత్త సదుపాయం.. 3 నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్‌.!

హైదరాబాద్‌ మెట్రోలో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైళ్లలో జీ5 మొబైల్ అప్లికేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. జీ5 సేవల ద్వారా మెట్రలో మొబైల్‌ డాటా వినియోగించకుండానే వీడియోలు, ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు. మొదట పది మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత అన్ని స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని మెట్రో అధికారులు వెల్లడించారు. జీ5 ఉచిత సేవలో భాగంగా మొదటి 60 రోజులు ఉచితంగా ఇంటర్నెట్‌ అందిస్తామని తెలిపారు. జీ5 సేవల ద్వారా మూడు నిమిషాల్లోనే సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేయనున్నారు. జీ5 సేవలు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ సీఈవో రోహిత్‌ తెలిపారు. తర్వలో ఈ లెర్నింగ్‌, ఈ కామర్స్‌, ఫుడ్‌ వంటివి కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. తర్వలో ఈ వై-ఫై సేవలను అన్ని మెట్రో స్టేషన్లలో ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కారణంగా ప్రజలు ఎక్కువగా మెట్రోకి ప్రాధాన్యం చూపుతున్నారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు వేగంగా తీసుకువెళ్తూ హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులను చూరగొంటోంది. రోజువారీ అధిక సంఖ్యలో ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌, నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు రెండు కారిడర్లలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలో ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు నిర్మించిన కారిడార్‌ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి సిగ్నలింగ్‌, వేగం, పవర్‌, స్టేషన్లను చెక్ చేస్తున్నారు. కెనాడాలోని థాలెస్‌ కంపెనీ.. మెట్రో రైళ్లను ఆటోమెటిగ్గా నియంత్రించుకునే టెక్నాలజీని ఇచ్చింది. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెట్రో సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Next Story