హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కరోనా కలకలం
By సుభాష్ Published on 8 Jun 2020 7:57 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇతర జిల్లాల్లోకూడా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాజాగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 4వ అంతస్తులోని ఒక సెక్షన్‌లో పని చేసే ఉద్యోగికి కారోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యాలయంలో 1500 మంది ఉద్యోగులు బల్దియాలో పని చేస్తున్నారు. దీంతో నాలుగో అంతస్తులో పని చేసే ఉద్యోగులందరిని ఇళ్లకు పంపించారు.
ఇది చదవండి: ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు
జీహెచ్‌ఎంసీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారని, ప్రధాన కార్యాలయం అంతా శానిటైజ్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కార్యాలయంలోని అన్ని గదులను సిబ్బంది శుద్ది చేస్తున్నారని అన్నారు. అలాగే ఉద్యోగుంలదరినీ ఒక హెల్త్ ఆఫీసర్ అబ్జర్వేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకూ మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.