హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ బస్సులు..!
By సుభాష్ Published on 7 Nov 2020 1:11 PM GMTఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉండేది. నిజాం కాలం నాటి కాలంలో ఈ బస్సులు తిరుగుతుండగా, ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువకుడు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. ప్రస్తుతం కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్‌లో మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు, టూరిస్టులకు ఎంతో బాగుంటుందని కేటీఆర్‌ను షాకీర్ హుస్సేన్ కోరారు.
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో తాను చదువుకున్నప్పుడు దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సుల గురించి చాలా జ్ఞపకాలున్నాయి. అవిప్పుడు గుర్తుకు వస్తున్నాయి అంటూ కేటీఆర్ తెలిపారు. ఆ బస్సులను ఎదురు ఆపేశారో నాకు తెలియదు.. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా..? అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. అయితే డబుల్ డెక్కర్ బస్సులు వచ్చే అవకాశం ఉంటే నగరంలో మళ్లీ దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఇలా మంత్రి ట్వీట్‌పై నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు. సార్.. త్వరగా తీసుకుండి... ప్రయాణికులకు ఎంతో బాగుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.