మద్యం మత్తులో తండ్రి.. ఐదేళ్ల కూతురిపై దారుణం..!

By అంజి  Published on  11 Jan 2020 7:38 AM GMT
మద్యం మత్తులో తండ్రి.. ఐదేళ్ల కూతురిపై దారుణం..!

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. కన్నకూతురు అనే కనికరం లేకుండా ఓ తండ్రి తన కూతురిని హతమార్చాడు. ఆ చిన్నారికి ఐదేళ్ల వయసులోనే ఆయుష్షు నిండిపోయింది. మద్యం మత్తులో తండ్రే కాల యముడయ్యాడు. ఫూటుగా మద్యం సేవించిన తండ్రి దుర్గారావు తన ఐదేళ్ల కూతురు యామినిని గొంతునులిమి చంపాడు. నిందితుడు దుర్గారావును స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బాలాజీనగర్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దుర్గయ్య కొన్ని సంవత్సరాలుగా ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌పని చేస్తున్నారు.

చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఫూటుగా మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడడం, వారిపై దాడి చేయడం ఇలాంటి ఘటన తరచూ చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దారుణాలు మాత్రం ఆగడం లేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ చిన్నారి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

Next Story