హైదరాబాద్‌లో బాంబు పేలుడు
By సుభాష్ Published on 8 Feb 2020 8:16 AM GMTహైదరాబాద్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో శనివారం జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. వైట్ హౌస్ హోటల్ సమీపంలోని ఓ చెత్తకుండీలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బాలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనను తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందే హైదరాబాద్‌కు ఉగ్ర ముప్పు ఉండటంతో భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. గాయలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చెత్త కుండీలో పడేసిన పెయింట్ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్ రప్పించి చుట్టుపక్కల తనిఖీలు చేపట్టారు. పేలుడుకు కారణమైన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపడుతున్నారు. అలాగే పేలుడుకు ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పేలుడు వల్ల భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఓ వ్యక్తి చెత్తను ఏరుకుంటుండగా ఇదే విధంగా పేలుడు సంభవించింది.