హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్‌లపై మంత్రి కేటీఆర్ సమీక్ష
By సుభాష్ Published on 20 May 2020 9:58 AM GMTహైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఆర్డీలో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో.. మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్‌లపై చర్చించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో చాలా చోట్ల 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్‌లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించడం జరిగిందని అన్నారు. త్వరలో మిగిలిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, లాక్‌డౌన్ సమయంలో కూడా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోలేదని, పనులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ సుమారు 10వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తలసాని అన్నారు.
ఈ సమావేశానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిఅరవింద్ కుఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు హాజరయ్యారు.