భార్య‌ చేతులు కోసిన భ‌ర్త‌.. అత‌నో ఎంపీడీవో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Dec 2019 8:58 AM GMT
భార్య‌ చేతులు కోసిన భ‌ర్త‌.. అత‌నో ఎంపీడీవో..

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. భ‌ర్త మ‌ద్యం సేవించి భార్య‌పై క‌త్తితో దాడి చేసి .. రెండు చేతుల‌ను కోసాడు. వివ‌రాళ్లోకెళితే.. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్‌ అనిల్‌కుమార్ కు అదే జిల్లాకు చెందిన మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్‌.. సిర్పూర్‌ ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

అనిల్‌ నిత్యం తాగొచ్చి అదనపు కట్నం కోసం త‌న భార్య‌ను శారీరకంగా వేధిస్తున్నాడు. శుక్రవారం కూడా మద్యం సేవించిన అనిల్.. భార్య‌పై కత్తితో దాడి చేసి రెండు చేతుల‌ను కోశాడు. భ‌ర్త వేధింపుల‌ను భ‌రించ‌లేక‌పోయిన మేరీ కుమారి భర్త జగదీష్‌ అనిల్‌కుమార్‌ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it