హోం క్వారంటైన్‌లో భర్త.. ఆగదికి తాళం వేసి ప్రియుడితో భార్య జంప్
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 5:53 PM IST
ఢిల్లీ నుంచి సొంత గ్రామానికి వచ్చిన భర్త ప్రభుత్వ నియమాలను అనుసరించి తన ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. భర్త ఉంటున్న గదికి బయట నుంచి తాళం వేసింది భార్య. అనంతరం తన ప్రియుడితో కలిసి పారిపోయింది. తాళం వేసిన విషయాన్ని గమనించిన భర్త ఇరుగుపొరుగు వారి సాయంతో బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మధ్య ప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా ముందేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్యా పిల్లలు కొన్నాళ్ల పాటు ఢిల్లీలోనే ఉన్నా.. ఏడాదిన్నర క్రితం సొంత గ్రామం ముందేరికి వచ్చి అక్కడే ఉంటుండగా.. అతడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్యకు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త కూడా ఇంటి పట్టున లేకపోవడంతో వారి హద్దు లేకుండా పోయింది.
లాక్‌డౌన్ కారణంగా ఇటీవలే ఆమె భర్త సొంతూరి వచ్చాడు. అయితే.. ప్రభుత్వ నిబంధనల కారణంగా తన సొంటింటిలోని పై అంతస్తులో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటున్నాడు. భార్య పిల్లలు మాత్రం కింది ఫ్లోర్‌లో ఉంటున్నాడరు. భర్త ఇంటికి రావడంతో ప్రియుడి సరిగ్గా కలవలేకపోయింది. భర్త ఉంటున్న గదికి బయటి నుంచి తాళం వేసి ఏకంగా ప్రియుడితో పరారైంది. బయటికి నుంచి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో ఇంటి నుంచి బయట పడిన ఆ భర్త.. తన భార్య పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.