ఓ వివాహిత భర్త నుంచి విడాకులు తీకుకొని ఒంట‌రిగా ఉంటోంది. ఓ యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారితీసింది. పెళ్లి చేసుకొమ‌ని ప్రియుడిని కోరింది. ఆమెను న‌మ్మించి ఇంటికి తీసుకెళ్లి హ‌త్య చేసి.. ఆ మృత‌దేహాన్ని ఆ ఇంట్లోనే పాతి పెట్టాడు. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కొల్లామ్‌ జిల్లాకు చెందిన సుచిత్ర(42) భ‌ర్త నుంచి విడాకులు తీసుకొని కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా ప‌నిచేస్తోంది. కాగా.. మార్చి 17న మామ‌య్యా బాగోలేద‌ని, తాను వెంట‌నే అలప్పుజాకు వెళ్లాల‌ని కంపెనీలో చెప్పి సెల‌వు తీసుకుంది. ఆ త‌ర్వాత రోజు మ‌రో ఐదు రోజులు సెల‌వులు కావాల‌ని కంపెనీకి మెయిల్ చేసింది.

ఇక ఇంటికి వెళ్లిన సుచిత్ర.. ట్రైనింగ్ నిమిత్తం ఎర్నాకుళంకు వెళ్లాల‌ని కంపెనీ వాళ్లు పంపిస్తున్నార‌ని కుటుంబ స‌భ్యుల‌తో చెప్పి బ‌య‌లుదేరింది. ఇంటి నుంచి వెళ్లిన సుచిత్ర 5 రోజులైన ఫోన్ చేయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు ఆమె ప‌నిచేసే చోటుకు వెళ్లారు. అక్క‌డ ఆరా తీయ‌గా.. కంపెనీ వాళ్లు ఎక్క‌డికి పంప‌లేద‌ని, సుచిత్ర‌నే 5 రోజులు సెల‌వు పెట్టీ మామ‌య్య వాళ్ల ఇంటికి వెలుతున్న‌ట్లు చెప్పిందని అక్క‌డ‌ని వారు చెప్పారు.వెంట‌నే కంగారు ప‌డిన కుటుంబ స‌భ్యులు కొట్టాయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ద‌ర్యాప్తులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

మ‌నాలీలో ఉండే ప్ర‌శాంత్‌(32) కీ బోర్డు ప్లేయ‌ర్‌గా ప‌నిచేసేవాడు. సోష‌ల్ మీడియా ద్వారా సుచిత్ర‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ప్ర‌శాంత్ ను క‌ల‌వ‌డానికే సుచిత్ర మ‌నాలీ వెళ్లి ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు. కొల్లాయం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

సుచిత్ర త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని.. ఇద్ద‌రికి పెళ్లి విష‌యంలో గొడ‌వ జ‌రిగింద‌ని ఈ క్ర‌మంలో ఆవేశానికి లోనైన సుచిత్ర ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌శాంత్ చెప్పాడు. ప్ర‌శాంత్ మాట‌ల‌ను న‌మ్మ‌ని పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేసే స‌రికి అస‌లు నిజం ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాల‌ని సుచిత్ర ఒత్తిడి చేయ‌డంతో ఆమెను చంపేశాన‌ని, ఆ త‌రువాత ఆమె శ‌వాన్ని తాను ఉంటున్న ఇంట్లో పాతి పెట్టాని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్లి.. ప్ర‌శాంత్ చెప్పిన చోట త‌వ్వ‌గా.. కుళ్లిన స్థితిలో సుచిత్ర మృత‌దేహాం ల‌భించింది.

మొదట సుచిత్ర, తాను పెళ్లి విషయమై పోట్లాడుకున్నామని, తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్‌ తెలిపాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. గత కొంతకాలంగా సుచిత్ర తనను ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు ప్రశాంత్‌‌ ఒప్పుకున్నాడు. తర్వాత ఆమె శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పాతి పెట్టానని తెలిపాడు. ప్రశాంత్‌ చెప్పిన వివరాల ప్రకారం సుచిత్ర పాతిపెట్టిన చోటును తవ్వించగా ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించింది.ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా ఆ మృతదేహం సుచిత్రదేనని తేలింది. ప్రశాంత్‌‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *