కరోనా తెచ్చిన కష్టం అంతాఇంతా కాదు.. ఏంటీ తిప్పలు వాళ్లకి..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 April 2020 10:26 AM GMTకరోనా తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీఇన్ని కావు. లాక్‌డౌన్ కారణంగా అన్ని మూతపడటంతో ఇంటిపట్టున ఉన్న జనాలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అందరి బాధ ఎలా ఉన్నా.. మందుబాబుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే కొంతమంది ఆసుపత్రుల పాలవుతుండగా.. మరి కొంతమంది ఎలాగోలా మందు సంపాదించే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు.
ఈ నేఫథ్యంలో మందు ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చని గూగుళ్లో వెతుకున్నారట కొందరు. ఇక ఆలోచన వచ్చిందే తరువాయి.. ఆలస్యం చేయకుండా.. ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా? అని వెతుకుతున్నారట. లాక్‌డౌన్ ప్రారంభమయిన మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్‌లైన్ సర్చింగ్ లో ఇదే ట్రెండింగా టాఫిక్.
ఇదిలావుంటే.. పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఎంత కట్టడిచేసినా కొన్ని చోట్ల బ్లాక్ లో మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వాటి ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రూ. 500 విలువ చేసే పుల్ బాటిల్ రూ. 5000గా అమ్ముతున్నారు. ఇక బీర్లు కూడా రూ. 300-400 మధ్యలో అమ్ముతున్నారని టాక్. ఎలాగోలా ప్రయాసపడి డబ్బు సిద్దం చేసుకున్నా ఆ మందు నోటి దాకా వస్తుందో.. రాదో డవుటే. మరి మందుబాబుల కష్టాలకు ఎప్పుడు ఎండ్ కార్డు పడనుందో చూడాలి మరి.