విషాదం: ఇల్లు కూలి ముగ్గురు మృతి

By సుభాష్  Published on  21 Aug 2020 9:24 AM GMT
విషాదం: ఇల్లు కూలి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. పితోర్‌ఘర్‌ జిల్లాలోని చైసర్‌ గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ యజమానితో పాటు ఆయన ఇద్దరు పిల్లలు శిథిలాల కింద చిక్కుకుపోయి మృతి చెందారు. ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఇల్లు కూలిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా పలు ఇళ్లు కూలిపోతున్నాయి. అలాగే కొండచరియలు విరిగి పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగానే ఇల్లు కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.Next Story
Share it