బ్రేకింగ్: శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రం అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి..!

By సుభాష్  Published on  21 Aug 2020 9:00 AM GMT
బ్రేకింగ్: శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రం అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి..!

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతదేహాన్నిరెండో టన్నెల్‌లో సూర్యాపేటకు చెందిన ఏఈ సుందర్‌నాయక్‌గా గుర్తించగా, కొద్దిసేపటి క్రితం మరో ఐదు మృతదేహాలను గుర్తించారు రెస్క్యూ టీమ్‌ సిబ్బంది. అయితే ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. టన్నెల్‌ లోపల ఇంకా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

మంటలను ఆర్పేందుకు దాదాపు 12 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, లోపల చిక్కుకున్న వారు ఒకరు డీఈ కాగా, నలుగురు ఏఈలు, ఇద్దరు టెక్నికల్‌ సిబ్బంది, ఇద్దరు అటెండర్లున్నట్లు అధికారులు గుర్తించారు. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 7 టన్నెల్స్‌ ఉండగా, ఒకటిన్నర టన్నెల్‌ వరకే రెస్క్యూ టీమ్‌ వెళ్లగలిగింది. లోపల చిక్కుకుపోయిన వారి చెప్పులు, జర్కిన్లు, ఇతర వస్తువులను రెస్య్కూ టీమ్‌ గుర్తించింది.

అయితే పవన్‌ సరఫరా అయితేనే రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఇంకో రెండు గంటల పాటు ఆపరేషన్‌ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పొగ, మంటలు తాళలేక సిబ్బంది టన్నెల్‌ లోపలికి పరుగులు తీసినట్లు భావిస్తున్నారు రెస్క్యూ టీమ్‌ సిబ్బంది. ఇక యంత్రాలను పెట్టి పొగను బయటికి పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Next Story