ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఫైర్.. ఆ 150 మంది కార్మికులు..
By అంజి
బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్ లు తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపుగా 13 మంది మృతి చెందారు. కాగా మరో 21 మందికి గాయాలు అయ్యాయి. ఆ దేశ రాజధాని ఢాకా శివారులోని కేరానిగంజ్ లో గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నారని ఓ క్షతగాత్రుడు తెలిపాడు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.