మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 Sept 2020 9:32 AM IST

మళ్లీ ఆస్పత్రిలో చేరిన  కేంద్ర మంత్రి అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యంతో శనివారం అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమిత్‌ షా.. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం అమిత్‌ షా ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

కాగా.. ఆగష్టు 2న అమిత్ షాకు కరోనా రావడంతో గుర్‌గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఆగష్టు 14న ట్వీట్ చేసిన హోం మంత్రి.. వైద్యుల సలహా మేరకు మరో కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంటానని వెల్లడించారు. అయితే నీరసం, శరీర నొప్పులతో ఆగష్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. ఆగష్టు 31న అక్కడి నుంచి డిశ్చార్జి అవ్వగా.. కేంద్రమంత్రి కరోనా నుంచి కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Next Story