Fact Check : ఇంటింటికీ ఉచితంగా బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ ట్యాబ్లెట్లను ఇవ్వాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించుకుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2020 8:14 AM GMT
Fact Check : ఇంటింటికీ ఉచితంగా బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ ట్యాబ్లెట్లను ఇవ్వాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించుకుందా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రాగు నీరు విషయంలో ప్రజలు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాచి వడబోసిన నీటినే తాగాలని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో హెచ్చరిస్తూ ఉన్నారు.

సంపు లోని నీరు వర్షపు నీటితో కలుషితమై ఉంటే వీలైనంత త్వరగా శుభ్రం చేయమని కోరుతూ ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేసిన తర్వాత బోరు నీటిని కానీ, ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిని కానీ సంపుల్లోకి వదులుకోవాలని సూచిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవేజ్ బోర్డు (హైదరాబాద్ జలమండలి) ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ ను, క్లోరిన్ ట్యాబ్లెట్లను ప్రతి ఇంటికీ ఉచితంగా సరఫరా చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

D1



నిజ నిర్ధారణ:

ఈ వైరల్ పోస్టులు నిజమే.

If your household water storage sump is mixed with rain water, pl empty it and clean & disinfect with bleaching powder and refill sump with HMWSSB water. As precaution pl mix the water with chlorine tablets. Chlorine tablets are distributed by HMWSSB staff at your doorstep.

October 16, 2020 ">మీడియా కథనాల ప్రకారం పైపులైన్లు లీకై వరద నీరు సంపుల్లోకి, ట్యాంకుల్లోకి చేరి నీరు అపరిశుభ్రమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు. సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్‌ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని జలమండలి సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్‌లో సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. న‌గ‌రంలో ప్రజలు తాగునీటి విష‌యంలో కొన్నిరోజులు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. కాచివ‌డ‌పోసిన నీటిని తాగితె సీజ‌న‌ల్ వ్యాధులు దరిచేరవని చెప్పారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవ‌స‌ర‌మైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

జలమండలి ఉద్యోగులు కేటీఆర్ ఆదేశాలమేరకు హైదరాబాద్ లోని ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను ఇస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంపు.. వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని కూడా జలమండలి హైదరాబాద్ ప్రజలకు ఒక ప్రకటన జారీ చేసింది. జలమండలి సరఫరా నీటితో సంపులు నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ నెం. 155313 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.

జలమండలి అధికారిక ట్విట్టర్ ఖాతా HMWSSB లో కూడా ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను ఇస్తున్నట్లు ప్రకటించారు.

D2



చాలా మంది తమ ఇంటికి జలమండలి బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను డెలివరీ చేస్తున్నారని పోస్టులు పెట్టారు.

D3

D4



ప్రజల ఇంటి వద్దకే వచ్చి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను హైదరాబాద్ జలమండలి ఇస్తూ ఉండడం నిజమే..!

Claim Review:Fact Check : ఇంటింటికీ ఉచితంగా బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ ట్యాబ్లెట్లను ఇవ్వాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించుకుందా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:False
Next Story