భ‌ళా రోహిత్.. బౌండ‌రీ లైన్‌లో అదిరిపోయే క్యాచ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jan 2020 8:22 AM GMT
భ‌ళా రోహిత్.. బౌండ‌రీ లైన్‌లో అదిరిపోయే క్యాచ్‌..!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అక్టాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెన‌ర్లు ఆ జ‌ట్టుకు శుభారంభం అంధించారు. మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రోలు మొద‌టి వికెట్‌కు 7 ఓవ‌ర్ల‌లో 70 ప‌రుగులు సాధించారు.

అనంత‌రం మంచి ఊపుమీదున్న ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్.. శివం దూబే వేసిన 8వ ఓవ‌ర్ చివ‌రి బంతికి భారీ షాట్ ఆడాడు. లాంగ్ఆన్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. సిక్స్ వెలుతుంద‌ని డిసైడ్ అయిపోయిన గ‌ప్టిల్.. నిరాశ‌తో వెనుదిరిగాడు.

రోహిత్ మాత్రం బౌండ‌రీ లైన్ మీద మ‌రోమారు అద్భుత‌మైన క్యాచ్ ఒడిసి ప‌ట్టుకున్నాడు. ముందుగా.. క్యాచ్ అందుకునే క్ర‌మంలో బంతిని అందుకున్న రోహిత్.. బౌండ‌రీ లైన్‌కు తాక‌కుండా బంతిని గాల్లోకి విసిరాడు. అనంత‌రం రెండో ప్ర‌య‌త్నంలో రోహిత్‌ బంతిని అందుకోవ‌డంతో టీమిండియా ఆట‌గాళ్లు సంబ‌రాల‌లో మునిగితేలారు. ఇదిలావుంటే.. కివీస్ ప్ర‌స్తుతం.. 14 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 143 పురుగులు సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని టీమిండియా జట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అంతే కాకుండా ధవన్‌, పాండ్యా, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ గాయాలతో దూరం కావడం కూడా టీమిండియా జట్టును కలవరపెడుతోంది.

Next Story