హిమాచల్‌ ప్రదేశ్‌ లో చంబా జిల్లాలోని చెహ్లీ గ్రామపరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఐదుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఐదుగురు చనిపోగా, మరో 35 మందికి గాయాలయ్యాయి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.