ఆసుప‌త్రికి వెళ్లి సుధాకర్‌ వాంగ్ములం తీసుకోండి : హైకోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 7:36 AM GMT
ఆసుప‌త్రికి వెళ్లి సుధాకర్‌ వాంగ్ములం తీసుకోండి : హైకోర్టు

న‌ర్సీప‌ట్నం స‌స్పెండెడ్‌ అన‌స్థీసియా వైద్యుడు సుధాకర్‌ అరెస్టుపై నేడు ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రస్తుతం సుధాక‌ర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేప‌థ్యంలో.. ఆయ‌న‌‌ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గురువారం సాయంత్రంలోగా సుధాక‌ర్‌ వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంత‌రం ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు శుక్ర‌వారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌భుత్వం తమకు మాస్కులు అందుబాటులో ఉంచకుండా త‌మ‌తో పనులు చేయించుకుంటున్నారని ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో వైద్యుడు సుధాకర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే.. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం జాతీయ రహదారిపై ఆయన గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడంతో సుధాక‌ర్‌ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు.

Next Story
Share it