ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,159 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 68 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కి చేరింది. 43 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 1639 మంది డిశ్చార్జి కాగా.. 715 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 53 కి చేరింది.

కోయంబేడు మార్కెట్ నుంచి వ‌చ్చిన వారిలో ప‌ది మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. వారిలో ఆరుగురు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. న‌లుగురు నెల్లూరు జిల్లాకు చెందిన వారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *