ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
By సుభాష్ Published on 3 Feb 2020 9:43 PM IST
ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నిలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి 17న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి జనవరి 17న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మరోసారి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లైన్ క్లీయర్ అయినట్లయింది. అలాగే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ భవనాలకు రంగులు తొలగించండి
కాగా, ఇటీవల హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు సూచించింది. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు వస్తున్నందునే పార్టీ రంగులను తొలగించాలని జగన్ సర్కార్‌కు కోర్టు ఆదేశించింది .