ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేసిన రైతులు

By రాణి  Published on  3 Feb 2020 12:33 PM GMT
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేసిన రైతులు

ఏపీ విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ కార్యాలయాల తొలగింపును సవాల్ చేస్తూ రాజధాని రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 13 చట్ట విరుద్ధమని రైతుల పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హై కోర్టు మంగళవారం విచారణ చేయనుంది. పిటిషన్ లో రాష్ర్ట ప్రభుత్వాన్ని, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చారు ఇంద్రనీల్. ఇప్పటికీ రాజధాని రైతులు అమరావతిని తరలించవద్దంటూ చేస్తున్న నిరసన, ఆందోళనలు 50 రోజులకు చేరాయి.

కాగా..ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రికి రాత్రే న్యాయ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి సంచలన ప్రకటనతో ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా మొదలుపెట్టింది. ఏపీ పాక్షిక న్యాయవిభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యులకు సంబంధించిన కారయాలయాలను తరలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెలగపూడి సచివాలయంలో ఉండే ఈ కార్యాలయాలు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో కర్నూల్ కు తరలిపోయాయి. హైకోర్టు అనుమతి లేనిదే ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అమరావతి నుంచి తరలించరాదని గతంలో హెచ్చరించినప్పటికీ..ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. పాలనా సౌలభ్యం కోసమంటూ..కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం ప్రకటించింది.

Next Story