ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు న్యాయస్థానాని హాజరైన ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌ శర్మ… ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీల బకాయిలపై నిన్ననే నివేదికను అందించారు. సమ్మెపై గత నెల 30న కేంద్రానికి సమాచారమిచ్చామన్న ఆయన సంస్థకు రావాల్సిన బకాయిలన్నీ చెలించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసినట్లు నివేదించారు. హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ రూ.336.40 కోట్ల బకాయిలు చెల్లించిదని .. ఇక ఇవ్వలేమని చెప్పిందన్నారు. చట్టప్రకారం జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీకి నష్టాన్ని పూడ్చాల్సిన అవసరంలేదన్న ఆయన సమ్మె కాలంలో రూ.82కోట్ల నష్టం వాటిలినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఈ మేరకు ఆర్టీసీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు నివేదికను సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణం రాయితీని.. బకాయిల చెల్లింపులుగా నివేదికలో ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఈ నివేదిక అస్పష్టంగా ఉందని..సీనియర్‌ ఐఏఎస్ అధికారుల నివేదిక ఇలా ఉండడం ఆశ్యర్యంగా ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ నివేదికను అసంతృప్తిగా నివేదించారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.