ఆయన నేరస్తుడు కాదు.. అవి ఆరోపణలు మాత్రమే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 8:09 AM GMT
ఆయన నేరస్తుడు కాదు.. అవి ఆరోపణలు మాత్రమే..!

కడప: సీఎం వైఎస్‌ జగన్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. సీఎం జగన్‌ నేరస్తుడు కాదని.. ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు కోర్టులో స్టేలు తెచ్చుకోలేదా అని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి.. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉందన్నారు. అందుకే మినహాయింపు ఇవ్వమని కోర్టుకు అప్పీల్‌ చేసుకున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఖాళీగా లేని కూర్చీకోసం చంద్రబాబు ప్రాకులాడుతున్నారు.

మా ప్రభుత్వానికి ఐదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ సీటు ఖాళీ లేదన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామన్న చింత ఏ మాత్రం లేకపోగా.. ఆయన్ను ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అతినికతనే సొంత డబ్బా కొట్టుకోవడం విడ్డూరమన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో, పెయిడ్‌ ఆర్టిస్టులతో బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సి.రామచంద్రయ్య సూచించారు. చంద్రబాబుకు కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. ప్రజల మద్దతు లేదని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్ల ఓడిపోవడం దేశచరిత్రలోనే మొదటిసారి అని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు.

Next Story
Share it