సాగ‌ర తీరాన రెడ్ క‌ల‌ర్ బికినీలో..

By అంజి  Published on  21 Jan 2020 3:29 AM GMT
సాగ‌ర తీరాన రెడ్ క‌ల‌ర్ బికినీలో..

లోఫ‌ర్ చిత్రంతో తెలుగు ఆడియ‌న్స్‌కు ప‌రిచ‌య‌మైన దిశా ప‌టానీ ఆ చిత్రం త‌రువాత వెంట‌నే బాలీవుడ్‌కు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ త‌న అదృష్టం ప‌రీక్షించుకున్న‌దిశా ప‌టానీ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి భాగి వంటి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్ ద్వారా మంచి స‌క్సెస్‌ను అందుకుంది. ఆ త‌రువాత సైతం వ‌రుస సినిమాల‌తో బాలీవుడ్‌లో పాతుకుపోయిన దిశా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా బాగానే పేరు తెచ్చుకుంది.

Disha 1

అయితే, రీసెంట్‌గా వ‌చ్చిన స‌ల్మాన్ భార‌త్ మూవీలో లీడ్ రోల్‌లో న‌టించిన దిశా ఆ సినిమా ఫ్లాప్ అవ‌డంతో కాస్త వెనుక‌బ‌డింది. అయితే ప్ర‌స్తుతం అమ్మ‌డు మ‌లాంగ్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఆదిత్య‌రాయ్ క‌పూర్ స‌ర‌స‌న జోడీ క‌ట్ట‌గా, అనీల్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లొకేష‌న్ నుంచి దిశా ప‌టానీ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తున్నాయ‌నే చెప్పాలి.

సాగ‌ర తీరాన రెడ్ క‌ల‌ర్ బికినీలో దిగిన ఫోటోల‌ను దిశా సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, ఈ మ‌ధ్య కాలంలో దిశా ప‌టానీ బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేయ‌డం కాస్త ఎక్కువైంద‌నే చెప్పాలి. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయ‌క‌పోతే అమ్మ‌డుకు నిద్ర కూడా ప‌ట్టేలే లేదు.

Disha2

ఇప్పుడు కూడా అదే చేసింది. తాజాగా, మ‌రోసారి హాట్ ఫోటోస్‌ను త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో దిశా అప్‌డేట్ చేసింది. ద‌శ‌, దిశా లేని అందాల ఆర‌బోత చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. నిన్నా.., మొన్న‌టి వ‌ర‌కు బికినీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ‌రుస హాట్ బికినీ ఫోటోల‌తో ర‌చ్చ చేసిన దిశా పటానీ ఇప్పుడు ఏకంగా షూటింగ్ స్పాట్ నుంచి త‌న బికినీ అందాల‌ను పోస్టు చేయ‌డం విశేషం.

Next Story
Share it